పవన్‌కి దూరమైన తరువాత మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతోంది ఆయన మాజీ భార్య రేణుదేశాయ్. పెళ్ళికి ముందు పవన్‌తో కలిసి ‘బద్రి’, ‘జానీ’ మూవీస్‌లో నటించి ఆ తర్వాత తెరకు దూరమైంది రేణు. తెలుగు సినిమాల్లో ఆంటీ పాత్రలు చేయమని అడుగుతున్నారంటూ మీడియా ఇంటర్వ్యూ లో కూడా చెప్పింది. కానీ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్దమైన రేణు ప్రొఫెషనల్‌గా కూడా సెటిల్ అవ్వాలని చూస్తోంది.
అంతకు ముందే ఓ టెలివిజన్ ప్రోగ్రాంలో జడ్జ్ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత సైలెంట్ అయిపొయింది. తాజాగా రేణూ.. కొత్త రకం ఇన్నింగ్స్ మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది.అయితే ఆమెకు సినిమాల్లో నటించాలనే ఆశ అయితే లేదు కానీ వాణిజ్య ప్రకటనల్లోనూ…బుల్లి తెర మీద మెరవాలని మాత్రం రేణు ఆశపడుతోంది.
కళామందిర్ కళ్యాణ్ ”కాంచీపురం వరమహలక్ష్మి సిల్క్స్”కి రేణుదేశాయ్‌ని బ్రాండ్‌గా ఎంపిక చేసుకొని ఆమెతో ఇటీవల ఓ యాడ్ ఫిల్మ్‌ని చిత్రీకరించారు. ఈ ప్రకటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పక్క రేణు మాజీ భర్త పవన్ రాజకీయాల్లో బిజీ అవుతుంటే ఈమె ఈ విధంగా బిజీ అవుతోంది. అయితే దీనిపై పవన్.. ఆయన ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.