నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి నుండి టిడిపి తరపున పోటీ చేయడం జరుగుతుంది. ఈ పోటీ ఎంతో రసవత్తరంగా మారింది. నందమూరి వారసురాలిగా సుహాసిని తప్పక విజయం సాధించేలా తెలుగు తమ్ముళ్ల, టిడిపి కార్యకర్తలు పనిచేస్తున్నారు. మహాకూటమి తరపున కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సుహాసినికి అక్కడ సపోర్ట్ చేస్తున్నారు. ఇదిలాఉంటే సుహాసిని తరపున ఎన్.టి.ఆర్ ప్రచారానికి వస్తాడని కొన్నాళ్లుగా వస్తున్న వార్త. ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లు సుహాసిని తరపున ప్రచారం చేస్తారని అన్నారు.
కాని ఎన్.టి.ఆర్ మాత్రం అందుకు నిరాకరిస్తున్నాడట. తన తండ్రి హరికృష్ణ మరణించిన టైంలో తెలంగాణా ప్రభుత్వ పనితీరుని.. అంత్యక్రియల టైంలో కూడా ఇచ్చిన సహకారం గుర్తుంచుకుని ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నాడట. అంతేకాదు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం వస్తే తన సినిమాలకు అడ్డు తగిలే అవకాశం ఉంటుందని కూడా ఎన్.టి.ఆర్ ప్రచారానికి వెనక్కి తగ్గుతున్నాడట. సుహాసినికి ఎన్.టి.ఆర్, కళ్యాన్ రాం ప్రచారం మరింత బలం తీసుకొస్తుంది. తప్పకుండా ఆమె గెలుపుకి వారి ప్రచారం హెల్ప్ అవుతుంది.
కాని ఎన్.టి.ఆర్ మాత్రం అందుకు నిరాకరిస్తున్నాడట. సుహాసిని తరపున టి.ఆర్.ఎస్, బిజేపి అభ్యర్ధులు కూడా బలమైన వారే కావడంతో సుహాసిని గెలుపు మీద భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నందమూరి హరికృష్ణ కూతురుగా సుహాసిని మొదటిసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మహాకూటమి బలపరచిన టిడిపి అభ్యర్ధిగా సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ ప్రచారం కు రాకున్నా హరికృష్ణ మీద అభిమానంతో సుహాసినిని గెలిపిస్తారేమో చూడాలి.
అభిమానుల కోసం సుహాసిని ప్రచారంలో ఎన్టీఆర్..
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి