గురువారం రాం చరణ్ నటించిన వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా సినిమాపై మరింత క్రేజ్ వచ్చేలా చేసింది. ఇక ఈ ఈవెంట్ కు కె.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అవగా చిరంజీవి, త్రివిక్రం, అల్లు అరవింద్ లాంటి వారు గెస్టులుగా వచ్చారు. ముఖ్యంగా మెగా ఈవెంట్ ఏదైనా మాటల మాంత్రికుడు ఉండాల్సిందే. మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న అనుబంధం అలాంటిది.
ఇక మైక్ ఎత్తుకుంటే ఆయన మాటల ప్రవాహం గురించి తెలిసిందే. నిన్న కూడా అంతే మెగాస్టార్ చిరంజీవి గురించి త్రివిక్రం మాట్లాడిన మాటలు మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సిని ప్రియులను అలరించాయి. అందరు ఒకలా చెప్పగలిగితే అదే విషయాన్ని మరోలా చెప్పగలగడమే గొప్పతనం. త్రివిక్రం అలానే చేస్తాడు అందుకే ఆయన స్పీచ్ లకు అంత క్రేజ్ ఉంటుంది. మెగా ఈవెంట్ లో త్రివిక్రం మాటల తూటాలకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా కేవలం మెగా ఈవెంట్ లకు మాత్రమే త్రివిక్రం స్పీచ్ ఉంటుందా అని కొందరు డౌట్ పడుతున్నారు.
ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ త్రివిక్రం విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నారు. మెగా ఈవెంట్ లకు త్రివిక్రం వస్తే అది పవన్ సినిమా అయినా, అల్లు అర్జున్ సినిమా అయినా మెగాస్టార్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి చాలా ప్రత్యేకంగా చెబుతాడు త్రివిక్రం. అయితే ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేశాడు త్రివిక్రం ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రం రెండు మాటలతో సరిపెట్టాడు. మరి ఈ వ్యత్యాసం ఎందుకు అన్నది నందమూరి ఫ్యాన్స్ కు అర్ధం కాని ప్రశ్నగా ఉంది.