బుల్లితెర యాంకర్‌గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్ స్టేజ్ కి ఎదిగిన కలర్ ‘స్వాతి’.. తమిళ సినిమాల్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. తెలుగులో హీరోయిన్గా స్థిరపడలేకపోయినా.. తమిళం, మలయాళం సినిమాల్లో మంచి అవకాశాలనే అందుకుంటోంది స్వాతి. స్వామిరారా, అష్టాచమ్మా, కార్తికేయ వంటి చిత్రాలతో స్వాతి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కుస్తుందా… స్వాతి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్నా… తన హావభావాలని అందంగా పలికించి అందరిని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
తాజాగా ఆమె ఓ టీవీ ప్రోగ్రామ్ లో పాల్గొని అనేక విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా స్వాతి కొంతమంది హీరోల మీద సంచలన కామెంట్స్ చేశారు. రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న ‘నెం.1 యారి’ కార్యక్రమంలో ఇటీవల కలర్స్ స్వాతి యంగ్ హీరో నిఖిల్ తో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా… రానా అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానాలు చెప్పింది.
తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టయిల్… యాటిట్యుట్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చేంది. ఈ సందర్భంగా… ప్రిన్స్ మహేష్ బాబు తీరు పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. మహేష్ బాబు చాలా సైలెంట్ అని అంతా అనుకుంటూ ఉంటారని… కానీ… మహేష్ ఎంత విట్టీగా చమత్కారంగా ఉంటాడో చాలామందికి తెలియదు అంటూ చెప్పింది. అంతే కాదు… అటువంటి ఇమేజ్ మెయిన్ టైన్ చేయడం అంత సులువు కాదు అని కామెంట్స్ చేసింది. జూ ఎన్టీఆర్ నుంచి టాలెంట్ ప్రభాస్ నుంచి హైట్ రానా లవింగ్ నేచర్ తనకు ఇష్టం అంటూ మరికొంతమంది హీరోల ప్రవర్తన గురించి చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
రానా అడిగిన మరో ప్రశ్నకు సమాధానం చెప్పిన స్వాతి… ఇండస్ట్రీలో అమ్మాయిలకు లూజ్ క్యారెక్టర్ ఉంటుందని చాలామంది మగాళ్లతో తిరిగి నప్పుడు మాత్రమే అవకాశాలు వస్తాయి అన్న కామెంట్స్ వల్ల అనేక మంది టాలెంట్ ఉన్న అమ్మాయిలు సినిమాలకు దూరంగా ఉంటున్నారు అంటూ కామెంట్స్ చేసింది.