Gossips6.85 కోట్లు.. అయినా దక్కని ‘అమ్మ’ ప్రాణం.!

6.85 కోట్లు.. అయినా దక్కని ‘అమ్మ’ ప్రాణం.!

తమిళనాడు దివంగత నేత జయలలిత మరణం తమిళ ప్రజల్లో అల్లకల్లోలం సృష్టించింది. రాజకీయ పరంగా కూడా రాష్ట్రం మొత్తం ఆమె మరణించిన సమయంలో అట్టుడికిపోయింది. చెన్నై అపోలో హాస్పిటల్ లో 70 రోజుల దాకా ట్రీట్ మెంట్ తీసుకుని జయలలిత మరణించడం జరిగింది. ఆమె ఏ కారణం వల్ల మృతి చెందారు అన్న విషయం మీద తమిళ ప్రజలందరికి ఇప్పటికి ఓ పెద్ద డౌటే. అయితే ఇదిలాఉంటే జయలలిత మరణించిన టైంలో ఆ 70 రోజుల హాస్పిటల్ బిల్లు లీక్ అయ్యింది.
1
అక్షరాల 6.85 కోట్లు ఖర్చు అయ్యిందట. ఆమె ట్రీట్ మెంట్ తో పాటుగా పార్టీ కార్యకర్తలకు భోజనాలు.. మీడియా తిండి ఖర్చు, వసతులు అన్ని కలిపి 6.85 కోట్లు దాకా అయ్యిందట. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఖర్చు ఎంత అయ్యింది. ఎంత రాశారు అని ఎవరు చూడలేదు. కోట్ల కొద్ది అప్పుడు చేతులు మారిన విషయం తెలిసిందే. అమ్మ మరణం తమిళ ప్రజల హృదయాలను గాయం చేస్తే ఆమెకు ఇంత ఖర్చు పెట్టి వైద్యం చేయించినా కాపాడలేకపోయారని అంటున్నారు.

ఇప్పటికి అమ్మ మరణం ఓ ప్రశ్నార్ధకరంగా ఉంది. ట్రీట్ మెంట్ కు సహకరించలేని ఆమె గుండెపోటుతో మరణించారని అపోలో హాస్పిటల్ వారు అఫిషియల్ ప్రకటన ఇచ్చినా అది ఎంతవరకు వాస్తవం అన్నది మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐరన్ లేడీగా తమిళనాడు రాజకీయాలను శాసించిన జయలలిత హాపిటల్ ఖర్చు గురించి విషయాలు ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి. మరి వీటిపై తమిళనాడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news