Gossipsరానా, త్రిషా సీక్రెట్.. బయటపెట్టిన కరణ్..!

రానా, త్రిషా సీక్రెట్.. బయటపెట్టిన కరణ్..!

టాలీవుడ్ క్రేజీ హీరో రానా దగ్గుబాటి, సౌత్ క్రేజీ హీరోయిన్ త్రిషల లవ్ ఎఫైర్ గురించి అప్పట్లో ఓ సెన్సేషన్. ఈ ఇద్దరి సీక్రెట్ రిలేషన్ మీద మీడియా ఎప్పుడు హాట్ హాట్ న్యూసులు రాస్తూ వచ్చింది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని కూడా వార్త్రలు రాశారు. తీరా చూస్తే ఇప్పుడు ఎవరిదారి వారు చూసుకున్నారు. త్రిషతో రానా రిలేషన్ షిప్ ఏంటి అంటే ఎవరు ఊసెత్తలేదు. అయితే కాఫీ విత్ కరణ్ లో ఆ గుట్టు విప్పే ప్రయత్నం చేశాడు కరణ్ జోహార్. త్రిష గురించి రాని డైరెక్ట్ ఎటాక్ చేశాడు కరణ్.

త్రిషాతో రిలేషన్ ఏంటి.. ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే.. వు ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని సింపుల్ ఆన్సర్ చెప్పాడు రానా. కలిసి తిరిగి మీడియా కంట కనబడి ఇప్పుడు ఫ్రెండ్స్ అని తప్పించుకునే తెలివితేటలు ఈ కాలం హీరోలకు బాగా అలవడింది. త్రిష, రానాల సీక్రెట్ రిలేషన్ అందరికి తెలుసు కాని అది జస్ట్ ఫ్రెండ్ షిప్ అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు రానా. కరణ్ షో బోల్డ్ గా ఉంటుందని తెలిసి రానా చేసే ఈ కవరింగ్ ను ఎవరు నమ్ముతారు చెప్పండి.

ఇక షో అంతా చాలా సరదాగా నడిచింది. ప్రభాస్ ను కూడా అనుష్కతో ఎఫైర్ గురించి అడిగితే మీలాంటి వారి వల్లే అలాంటి న్యూస్ లు వస్తున్నాయని.. మేమిద్దరం మంచి స్నేహితులం అనేశాడు. అయితే ప్రభాస్, అనుష్కల గురించి కూడా ఇద్దరికి పెళ్లి అంటూ మీడియా చేసిన హడావిడి తెలిసిందే. మొత్తానికి కరణ్ షో బాహుబలి ట్రియోతో సూపర్ సక్సెస్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news