బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు క్యాన్సర్ అంటూ హడావిడి చేస్తుంది ముంబై సోషల్ మీడియా. షాహిద్ కపూర్ కు స్టమక్ క్యాన్సర్ అని మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. అయితే ఈ న్యూస్ విన్న షాహిద్ వెంటనే స్పందించాడు. తనపై వస్తున్న ఈ వార్తలకు మీరు చింతించాల్సిన పనిలేదని అవి వట్టి రూమర్స్ మాత్రమే అని ఆయన అన్నారు. కొన్నాళ్లుగా షాహిద్ కపూర్ కు బాలీవుడ్ లో హిట్ దక్కడం లేదు. సినిమాలైతే చేస్తున్నా సరైన ఫలితాలు అందుకోవట్లేదు.
బాలీవుడ్ యువ హీరోగా షాహిద్ కపూర్ కు కొన్నాళ్లు మంచి క్రేజ్ ఉంది. కాని వరుస సినిమాలు నిరాశపరచడంతో ఆయన్ను వెనక్కి నెట్టేశాయి. ప్రస్తుతం షాహిద్ కపూర్ తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు దర్శకుడు సందీప్ వంగనే ఆ సినిమా డైరెక్ట్ చేస్తుండటం విశేషం. కబీర్ సింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు షాహిద్ కపూర్.
మరి ఎలా వచ్చిందో ఏమో కాని అతనికి స్టమక్ క్యాన్సర్ అంటూ దాని వల్లే ఆయన కెరియర్ వెనుక పడ్డదని కొందరు మీడియా వాళ్లు వార్తలు రాస్తున్నారు. ఈ వార్తలకు స్పందించకపోతే డౌట్ వచ్చేది కాని షాహిద్ క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదు. సో కబీర్ సింగ్ క్యాన్సర్ వార్తలన్ని ఉత్తిత్తే అన్నమాట.