తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో టి.ఆర్.ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఉద్యమపార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకే తెలంగాణా ప్రజలు ఓటేశారు. ఆయనకు పోటీగా మహాకూటమి ఓటమిపాలయ్యింది. అయితే ఈ గెలుపుకి టాలీవుడ్ సిని పరిశ్రమ కూడా ఆహ్వానించింది. టి.ఆర్.ఎస్ గెలిచిన కారణంగా పలువురు సిని ప్రముఖులు కె.సి.ఆర్-కె.టి.ఆర్ లను అభినందిస్తూ ట్వీట్ చేశారు. వారిలో మహేష్ బాబు, మోహన్ బాబులతో పాటుగా చాలా మంది స్టార్స్ ఉన్నారు. అయితే ఎన్.టి.ఆర్ మాత్రం ఇప్పటివరకు తెలంగాణా ఎలక్షన్స్ మీద ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదనే అక్క నందమూరి సుహాసిని కూకట్ పల్లి నియోజక వర్గం నుండి పోటీ చేసినా ఓటమిపాలయ్యింది. అయితే అక్క కోసం ప్రచారం చేయని ఎన్.టి.ఆర్ అలా చేయడం వల్ల తెలంగాణాలో మనుగడ కష్టమే అనుకున్నాడని అంటున్నారు. తెలంగాణా ప్రభుత్వ కార్యచరణలే కాదు తండ్రి మరణించిన సమయంలో గౌరవంగా అతిమసంస్కారాలు చేసింది టి.ఆర్.ఎస్ ప్రభుత్వం. అందుకే దానికి వ్యతిరేకంగా కాపెయిన్ చేయదలచు కోలేదు. అయితే టి.ఆర్.ఎస్ గెలుపుని ప్రశంసిస్తూ ఎన్.టి.ఆర్ కూడా ఓ ట్వీట్ చేస్తే పోయేది ఏముండదు.
ఎందుకంటే చంద్రబాబు టి.ఆర్.ఎస్ కు వ్యతిరేకంగా కూటమి తరపున ప్రచారం చేసి టి.ఆర్.ఎస్ గెలిచినందుకు అభినందిస్తూ ట్వీట్ చేశారు. మరి ఎన్.టి.ఆర్ చేస్తే దానికి అర్ధాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఏది ఏమైనా నందమూరి బ్రదర్స్ కు తెలంగాణ ఎలక్షన్స్ పెద్ద పరీక్ష పెట్టాయని చెప్పొచ్చు. ఎన్.టి.ఆర్ మాత్రమే కాదు కళ్యాణ్ రాం కూడా సుహాసిని తరపున ప్రచారం చేయలేదు. వీరు కేవలం సిని హీరోలుగానే కొంతకాలం కెరియర్ సాఫీగా కొనసాగించాలని ఆశిస్తున్నారు. అందుకే ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదు.