నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటైందా.. జూనియర్ తో బాలకృష్ణ, చంద్రబాబు సత్సంబందాలు కుదిరినట్టేనా.. ఇలాంటి ప్రశ్నలన్నిటికి హరికృష్ణ మరణించిన తర్వాత జరిగిన పరిణామాలన్ని సమాధానం ఇచ్చాయి. తెలంగాణా ఎలక్షన్స్ లో ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లను దూరంగా పెట్టడం ఏ వ్యూహ రచనో తెలియదు కాని నందమూరి సుహాసిని ఓడిపోవడం నందమూరి ఫ్యామిలీకి పెద్ద షాక్ ఇచ్చింది. బాలకృష్ణ వచ్చి మరి ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అందరి చూపు ఏపి ఎలక్షన్స్ మీద ఉంది.
ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ కోసం నిమ్మకూరులో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు బాలకృష్ణ. ఆ ఈవెంట్ కు నందమూరి ఫ్యామిలీ అంతా అటెండ్ అవుతుందట. సినిమా ఫంక్షన్ లానే ప్రచారం కూడా అక్కడి నుండే మొదలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నాడు బాలయ్య. అయితే ఈ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ అటెండ్ అవుతాడా లేడా అన్నది డౌట్ గా మారింది. ఎన్.టి.ఆర్ వస్తేనే ఆ ఈవెంట్ కు కాస్త క్రేజ్ వస్తుందని కొందరు నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. ఈమధ్యనే అరవింద సమేత ఈవెంట్ లో బాలకృష్ణ అటెండ్ అయ్యాడు.
ఇప్పుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ ఈవెంట్ కు జూనియర్ కు ఆహ్వానం వస్తుందా రాదా అన్నది తెలియాల్సి ఉంది. ఎన్.టి.ఆర్ అటెండ్ అయితేనే ఆ ఈవెంట్ కు నిండుతనం వస్తుందని కొందరి అభిప్రాయం. ఒకవేళ ఎన్.టి.ఆర్ లేకుండా ఆ ఈవెంట్ జరిపితే మాత్రం బాలకృష్ణ పైకి ఎన్.టి.ఆర్ ను కలుపుకున్నాడనే అర్ధమని చెబుతున్నారు. మరి ఎన్.టి.ఆర్ ఈవెంట్ లో నందమూరి ఫ్యామిలీ విత్ ఎన్.టి.ఆర్ వస్తే కనుక నందమూరి ఫ్యాన్స్ కు అంతకుమించిన పండుగ మరోటి ఉండదని చెప్పాలి.
ఎన్టీఆర్ వల్ల బాలయ్య కు మరో ఎదురు దెబ్బ..
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి