రామ్ చరణ్ కి ఝలక్ ఇవ్వనున్న ఎన్టీఆర్..

‘వినయ విధేయ రామ’ గురించిన ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటి అంటే..? ఈ సినిమా వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరు అనేది అంతా సస్పెన్స్ గా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే… ఇది మెగా హీరో సినిమా కావడం ఒకటి అయితే… మరోది భారీ సెన్సేషనల్ సినిమాల డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం లో ఈ సినిమా రావడం. ఇప్పటికే విడుదలయిన టీజర్ అందిరికి తెగ నచ్చేసింది. వచ్చే నెల సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.అయితే ఇప్పటికే ఈ చిత్రం యొక్క టీజర్లు,పోస్టర్లు మరియు ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ సింగల్ కు కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ ఏర్పాట్ల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఒక ఊహించని అతిధి రాబోతున్నారు అని తెలుస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ వినయ విధేయ రామ షూట్ ముగించుకొని రాజమౌళి తో RRR చిత్రంలో బిజీగా ఉన్నారు.అయితే ఈ సినిమాలో మరో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ “వినయ విధేయ రామ” చిత్ర ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిధిగా రాబోతున్నారు అనే సమాచారం చెర్రీ – తారక్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని పెంచుతోంది.అయితే ఈ విషయంపై ఆ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఏ విధమైన స్పందన అయితే రాలేదు. కానీ… ముందు ఈ సినిమా ఫంక్షన్ కి మెగా స్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ కూడా హాజరవుతారంటూ… వార్తలు కూడా వినిపించాయి. కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఈ వార్త నిజామా అబద్దమా అనేది మాత్రం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

Leave a comment