ఫోబ్స్ జాబితా ఎన్టీఆర్ దెబ్బకి స్టార్ హీరోలకి చుక్కలు..

ఫోబ్స్ ఇండియా సెలబ్రిటీస్ 2018 లిస్ట్ వచ్చేసింది. ఎప్పటిలానే టాప్ సెలబ్రిటీగా నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్. సంవత్సరానికి 253.25 కోట్ల రూపాయలతో ఫోబ్స్ జాబితాలో సల్మాన్ మరోసారి సత్తా చాటాడు. ఇక టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లి ఫోబ్స్ జాబితాలో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. 228.09 సంవత్సర ఆదాయంతో విరాట్ కొహ్లి మరోసారి ఫోబ్స్ సెలబ్రిటీస్ లిస్ట్ లో నిలిచాడు. ఇక థర్డ్ ప్లేస్ లో అక్షయ్, ఓఫ్ర్త్ దీపికా పదుకునే, 5వ స్థానంలో మహింద్ర సింగ్ ధోని ఉన్నారు. 6-ఆమీర్ ఖాన్, 7-అమితాబ్ బచ్చన్, 8-రన్ వీర్ సింగ్,9-సచిన్ టెండుల్కర్, 10వ స్థానంలో అజయ్ దేవగన్ ఉన్నారు.

సౌత్ స్టార్స్ విషయానికొస్తే.. రజినికాంత్ 14వ ర్యాంక్ లో ఉండగా పవన్ కళ్యాణ్ 24వ స్థానంలో ఉన్నాడు. ఇక వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈసారి ఫోబ్స్ జాబితాలో సత్తా చాటాడు. 28వ ర్యాంక్ సాధించిన ఎన్.టి.ఆర్ సూపర్ స్టార్ మహేష్ ను వెనక్కి నెట్టేశాడు. సౌత్ లో రజిని తర్వాత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎన్.టి.ఆర్ ఫోబ్స్ లిస్ట్ లో ఉన్నారు. ఇక టాప్ 50లో మహేష్ 33వ ర్యాంక్ తో సరిపెట్టుకున్నారు. మహేష్ ను సైతం వెనక్కి నెట్టి ఎన్.టి.ఆర్ ఈసారి సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఫోబ్స్ ఇండియా సెలబ్రిటీస్ లో తారల సందడి తెలిసిందే. టాప్ 10లో సౌత్ స్టార్స్ కు అవకాశం దక్కలేదు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు 20వ స్థానంలో ఉంది. ఇండియా ప్రెస్టిజియస్ సెలబ్రిటీస్ లో ఫోబ్స్ జాబితాలో ఉన్న స్టార్స్ ప్రత్యేకమని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా సల్మాన్ ఖాన్ ఫోబ్స్ సెలబిటీస్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండగా లాస్ట్ ఇయర్ సెకండ్ ప్లేస్ లో ఉన్న షారుఖ్ ఖాన్ 13 స్థానం కు వెళ్లాడు.

Leave a comment