కొత్త ట్విస్ట్ : బాబుకు మెగా షాక్..!

టాలీవుడ్ సిని పరిశ్రమలో ఎక్కువశాతం టిడిపిని లైక్ చేస్తారు. చంద్రబాబు నాయకత్వంపై తెలుగు పరిశ్రమలో ఎంతోమందికి నమ్మకం ఉంది. అయితే సినిమా గ్లామర్ ను అప్పుడప్పుడు వాడుకునే చంద్రబాబు ఆ తర్వాత వారిని పట్టించుకోడు అన్న బ్యాడ్ టాక్ కూడా ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక తెలుగు ప్రజలు రెండు ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు సిని పరిశ్రమ మాత్రం అంతే ఉంది. అయితే హైదరాబాద్ నుండి వైజాగ్ కు పరిశ్రమ తరలించాలని అనుకుంటున్నా అందుకు సరైన వసతులు కనిపించడం లేదు.

ఇదిలాఉంటే సిని పరిశ్రమలో ఇన్నాళ్లు అత్యధికంగా టిడిపిని సపోర్ట్ చేసే వాళ్లే ఎక్కువగా ఉండగా కొత్తగా వచ్చిన పవన్ పార్టీ వల్ల కాస్త తేడా కొట్టిందట. పవన్ కళ్యాణ్ జనసేన వల్ల టిడిపికి పరిశ్రమలో సపోర్ట్ తగ్గిందని అంటున్నారు. చంద్రబాబు పనుల వల్ల పరిశ్రమలో కొందరు దూరమయ్యారని అంటున్నారు. ఇక పరిశ్రమలో స్టార్స్ గా ఉన్న ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లు కూడా ఇప్పుడప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో నందమూరి సుహాసిని నిలబడినా సరే అక్క కోసం ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం ప్రచారానికి రాలేదు.రాబోయే ఏపీ ఎన్నిక‌ల్లో చిత్ర‌ప‌రిశ్ర‌మ మొత్తం జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు అండ‌గా నిలిచే అవ‌కాశం వున్న‌ట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ ప్ర‌భావితం కార‌ణంగా చిత్ర‌ప‌రిశ్ర‌మ అంతా ఒక‌తాటిపైకి వ‌చ్చి పవ‌న్‌కు స‌పోర్ట్‌ చేస్తూ చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించ‌డం ఖాయంగా వినిపిస్తోంది.

ఈ సమీకరణాలన్ని పరిశ్రమలో టిడిపి ఫాలోవర్స్ కన్నా జనసేన ఫ్యాన్స్ ఎక్కువయ్యారాని అంటున్నారు. అయితే టాలీవుడ్ లో మేజర్ గా మాత్రం టిడిపిని సపోర్ట్ చేసే వారు ఉన్నారని కొందరి మాట. ఏది ఎలా ఉన్నా ఏపి ఎలక్షన్స్ లో టిడిపి వర్సెస్ వైసిపి రాజకీయ కొట్లాట అయితే టిడిపి వర్సెస్ జనసేన పరిశ్రమలో కొట్లాట జరిగే పరిణామాలు కనిపిస్తున్నాయి. మరి యుద్ధంలో ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి.

Leave a comment