Gossipsనో అంటూ నాని ని ఘోరంగా అవమానించిన కీర్తి

నో అంటూ నాని ని ఘోరంగా అవమానించిన కీర్తి

కీర్తి సురేష్ ! ఈ పేరు ఇప్పుడు సినీ ఇండ్రస్ట్రీలో మారుమోగుతోంది. తన విభిన్నమైన నటనాశైలితో …ఏ పాత్ర చేసినా అందులోకి వెంటనే పరకాయ ప్రవేశం చేస్తూ సహజంగా నటించడం కీర్తి స్పెషలిటీ. తమ గ్లామర్‌తో దుమ్ము రేగ్గొడుతున్న హీరోయిన్ల మధ్య కీర్తి చక్కటి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుని వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అంటే అది ఆమె టాలెంటే తప్ప మరొకటి కాదు.

ఇక మొన్నామధ్య వచ్చిన మ‌హ‌న‌టి సినిమాతో ఒక్క‌సారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది కీర్తి సురేష్‌.అంత‌క‌ముందు రెండు ,మూడు తెలుగు సినిమాల‌లో న‌టించింది ఈ భామ‌.కాని మ‌హ‌న‌టి సినిమాలో కీర్తి సురేష్ న‌ట‌న‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో కీర్తి తానేంటో నిరూపించుకుంది. దీంతో ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అంతేకాదు … ఆమె డేట్స్ కూడా ఇప్పుడు దొరకని అంత బిజీ అయిపొయింది ఆమె.

ఈ నేపథ్యంలో ఆమె తెలుగు యంగ్ హీరో నానితో సినిమా చేసే అవకాశాన్ని వదిలేసుకుంది.దీనికి కారణం ఆమె అప్పటికే… త‌మిళంలో ఒప్పుకున్న సినిమాలు ఉండ‌టం వ‌ల్ల నాని సినిమాకు డేట్స్ స‌ర్దుబాటు చేయ‌లేక సినిమా నుంచి త‌ప్పుకుంద‌ట‌. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన నేను లోకల్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మరో సారి ఈ హిట్ కంబినేషన్ కీర్తి బిజీ వలన మిస్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news