విజయ్ దేవరకొండ హీరోగ అరాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా టాక్సీవాలా. సినిమా మొత్తం ముందే లీక్ అవడం వల్ల ఈ సినిమాపై పెద్ద అంచనాలేవి లేవు కేవలం 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 16 కోట్ల దాకా బిజినెస్ చేసింది. మొదటి షో నుండే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ సాధించింది.
ఇక ఈ సినిమా 10 రోజుల్లో 19. 95 కోట్ల షేర్ రాబట్టింది. గీతా గోవిందం తర్వాత విజయ్ నటించిన నోటా ఫ్లాప్ అవ్వగా ఈ సినిమా మళ్లీ అతన్ని హిట్ ట్రాక్ ఎక్కించింది. అయితే సినిమా గీతా గోవిందం రేంజ్ హిట్ మాత్రం అందుకోలేదు.
ఇక ఏరియాల వారిగా టాక్సీవాలా 10 రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం : 7.40 కోట్లు
సీడెడ్ : 1.55 కోట్లు
ఉత్తరాంధ్ర : 1.72 కోట్లు
ఈస్ట్ : 0.87 కోట్లు
వెస్ట్ : 0.75 కోట్లు
కృష్ణా : 1.05 కోట్లు
గుంటూరు : 1.05 కోట్లు
నెల్లూరు : 0.41 కోట్లు
ఏపి/తెలంగాణ : 14.80 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.35 కోట్లు
ఓవర్సీస్ : 2.80 కోట్లు
వరల్డ్ వైడ్ : 19.95 కోట్లు