వరుస డిజాస్టర్స్ తో అసలు ఏమాత్రం ఫాంలో లేని శ్రీను వైట్ల బ్రూస్ లీ, ఆగడు, మిస్టర్ సినిమాల ఫలితాలు చూసి ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఎలాగోలా మాస్ మహరాజ్ రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. అమర్ అక్బర్ ఆంటోని అంటూ 30 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించాడు శ్రీను వైట్ల. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా కూడా శ్రీను వైట్లను నిరాశపరచింది.
రొటీన్ స్టోరీ.. విసుగు పుట్టించే స్క్రీన్ ప్లేతో శ్రీను వైట్ల ఏమాత్రం టాలెంట్ చూపించలేకపోయాడు. ఇక ఈ సినిమా ఓకే అయ్యాక రెమ్యునరేషన్ గా 3,4 కోట్లు మాత్రమే ఇస్తామని మైత్రి మేకర్స్ చెప్పారట. అయితే రెమ్యునరేషన్ తనకు వద్దని లాభాల్లో వాటా ఇవ్వమని వచ్చే రెమ్యునరేషన్ కూడా కాదన్నాడట శ్రీను వైట్ల. అయితే సినిమా షూటింగ్ టైంలో ఖర్చులు పెట్టుకుంటే చాలు అన్నాడట.
తీరా రిజల్ట్ తేడా కొట్టేసింది. అంతేకాదు సినిమాను ముందే అమ్ముకుని నిరాతలు కాస్త సేఫ్ అయినా శ్రీను వైట్లకు మాత్రం వాటా ఇచ్చే ఆలోచనలో లేరట. సినిమా ఆశించినట్టుగా ఫలితాన్ని అందుకోలేదు కాబట్టి నిర్మాతలు శ్రీను వైట్లకు హ్యాండ్ ఇచ్చారట. రెమ్యునరేషన్ ఇస్తామన్నప్పుడే తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని శ్రీను వైట్ల ఫీల్ అవుతున్నాడట.నాలుగు కోట్ల పారితోషికం తీసుకుని వుంటే పోయేదానికి ఎడమ కాలితో అదృష్టాన్ని తన్నేసుకుని రాని లాభం కోసం ఆశ పడి అన్ని విధాలా నష్టపోయాడు పాపం వైట్ల!