సర్కార్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బొమ్మ నిజంగానే హిట్టు..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ సర్కార్ ఇటీవల రిలీజయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తెలుగులోనూ ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
2
తెలుగులోనూ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం, బాక్సాఫీస్ వద్ద మరే ఇతర పెద్ద సినిమాలు లేకపోవడంతో సర్కార్‌ చిత్రానికి బాగా కలిసొచ్చింది. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ అమాంతం పెరిగాయి. మొదటి వారం ముగిసే సరికి ఈ సినిమా ఏకంగా రూ.7.94 కోట్ల మేర షేర్ కలెక్షన్స్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ ఏపీ/టీఎస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
1
ఏరియా – ఫస్ట్ వీక్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం – 2.53
సీడెడ్ – 1.80
ఉత్తరాంధ్ర – 0.83
గుంటూరు – 0.79
ఈస్ట్ – 0.55
వెస్ట్ – 0.45
కృష్ణా – 0.67
నెల్లూరు – 0.32
టోటల్ ఏపీ+తెలంగాణ – 7.94 కోట్లు

Leave a comment