ఎన్నో ఏళ్లుగా తెలుగు బాక్సాఫీస్ పై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు ఎట్టకేలకు సర్కార్ సినిమాతో ఆ కోరిక తీరింది. తెలుగులో ఇప్పుడు పెద్దగా సినిమాలు కాబట్టి ఈ రేర్ ఫీట్ సాధించాడు విజయ్. విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సర్కార్ సినిమా నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజైంది. సినిమాను 7.5 కోట్లకు కొన్నారు అశోక్ వళ్లభనేని.
ఈ వారం బాక్సాఫీస్ పై సర్కార్ సత్తా చాటింది. కొన్న రేటుకి మించి వసూళ్లను రాబట్టి విజయ్ కు తెలుగులో మంచి హిట్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా తెలుగు మార్కెట్ పై ఏమంత ప్రభావం చూపట్లేదు. సవ్యసాచి సినిమా కూడా 10 కోట్లు చేరుకోలేదు. ఇక రవిబాబు అదుగో ఎందుకు తీశాడో తెలియదు అన్నట్టు ఉంది. ఇక శుక్రవారం రిలీజైన కర్త కర్మ క్రియ సినిమా కూడా ఆడియెన్స్ ను మెప్పించడంలో విఫలమైంది. ఈ సినిమాకు ప్రమోషన్స్ లేకపోవడంతో పాటుగా ఆర్టిస్టులు కొత్తవాళ్లు కావడం వల్ల సినిమా ఆడియెన్స్ కు రీచ్ అవలేదు.
మొత్తానికి ఈ వారం విజయ్ సర్కార్ సినిమా మాత్రమే మంచి వసూళ్లను రాబడుతుంది. తెలుగులో సరైన ప్రమోషన్స్ లేకున్నా పోటీగా సినిమా ఏది లేకపోవడం వల్ల విజయ్ సర్కార్ కు బాగా కలిసి వచ్చింది.