ఒకప్పుడు మాస్ మహారాజ్ సినిమా అంటేనే ఫ్యాన్స్ ఈలలు వేసుకుంటూ హాళ్ళవైపు పరుగులుపెట్టేవారు. స్క్రీన్ మీద రవితేజ హీరోయిజం తో కూడిన అల్లరి అందరిని ఆకట్టుకునేది. కమెడియన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన రవితేజా కెరియర్ టాప్ హీరో రేంజ్ కి రాకెట్ లా దూసుకుపోయింది. అయితే…. ఇప్పుడు ఆ రాకెట్ ఎంత వేగంతో పైకి దూసుకుపోయిందో అంతే స్థాయిలో కిందికి దూసుకు వచ్చేసింది. గత కొంత కాలంగా రవితేజ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాపీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి.
రాజా ది గ్రేట్ సినిమాకు ముందు రవితేజ రెండు సంవత్సరాలపాటు బ్రేక్ తీసుకున్నాడు. దీనికి కారణం అంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ ప్లాప్ కావడమే కారణం. ఆ గ్యాప్ తరువాత వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా 30 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో రవితేజ కెరియర్ గాడిలో పడింది అనుకున్నారు అంతా … కానీ ఇప్పుడు తాజాగా వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కూడా … రవితేజకి పరాజయమే మిగిల్చింది. ఇలా వరుసగా ప్లాప్ లు పలకరించడంతో రవితేజ తో సినిమా అంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది. పాపం మాస్ మహారాజ్.
‘అమర్ అక్బర్ ఆంటొని’తో రవితేజకి మరో పరాభవం ఎదురయింది. చిన్న బడ్జెట్లో రూపొందిన హారర్ కామెడీ ‘టాక్సీవాలా’ ముందు ఈ చిత్రం వెలవెలబోతోంది. ఆ చిత్రానికి రెండు రోజుల్లో వచ్చిన వసూళ్ల కంటే తక్కువ వసూళ్లు ఒక రోజు ముందుగా వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటొని’కి వచ్చాయి.
రవితేజకి ఘోర అవమానం.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి