పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఈ మూవీని కొన్న బయ్యర్స్‌కు భారీ నష్టాలను మిగిల్చింది
ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అన్ని సినిమాలను హిందీలో డబ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా పవన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాను కూడా హిందీలో ‘ఎవడు 3’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షెన్‌ను అక్టోబరు 20న యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన లభించింది. హిందీలో డబ్ చేసి.. యూట్యూబ్‌లో విడుదల చేసిన దక్షిణాది సినిమాల్లో అత్యధిక వ్యూస్ అతి తక్కువ కాలంలో సాధించిన చిత్రంగా ‘అజ్ఞాతవాసి’ నిలిచింది.
మొదటి రోజు వ్యూస్ నుంచి అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ సాధించిన దక్షిణ భారతదేశ చిత్రంగా మరో రికార్డును నమోదు చేసుకుంది.కేవలం 11 రోజుల్లోనే ఈ రికార్డు సాధించి చరిత్ర తిరగరాసింది ఈ హిందీ అజ్ఞాతవాసి. ఈ సినమా . కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఖుష్బూ, ఆది పినిశెట్టి, బొమన్ ఇరానీ, రావు రమేశ్, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.
యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న పవన్..!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి