Movies" 24 కిస్సెస్ " రివ్యూ & రేటింగ్

” 24 కిస్సెస్ ” రివ్యూ & రేటింగ్

కుమారి 21ఎఫ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న హెబ్భా పటేల్ ఆ తర్వాత కూడా తన హాట్ లుక్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈమధ్య కెరియర్ లో కాస్త వెనుకపడిన అమ్మడు మళ్లీ కుమారి లాంటి బోల్డ్ సబ్జెక్ట్ తోనే వచ్చింది. 24 కిస్సెస్ ఆదిత్ అరుణ్, హెబ్భా పటేల్ జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఆనంద్ (ఆదిత్) చిల్డ్రెన్ ఫిల్మ్ మేకర్ మాస్ కమ్యునికేషన్ చేస్తున్న శ్రీలక్ష్మి (హెబ్భా పటేల్) వర్క్ షాప్ విషయమై ఆనంద్ తో జాయిన్ అవుతుంది. ఇక ఆనంద్, శ్రీలక్ష్మిలు ముద్దుతో ఒకటవుతారు. అలా వారి ప్రేమ ముద్దులతో సాగుతుంది. ప్రేమలో ముద్దులాట ఆడుతున్న వారు గోవాకి వెళ్తారు. శ్రీలక్ష్మికి ఆనంద్ అసలు స్వరూపం తెలిసిపోతుంది. అతను అమ్మాయిలను మోసం చేస్తాడన్న విషయం తెలుసుకుని అతన్ని ఛీ కొడుతుంది. అతని నుండి దూరమవుతుంది. మరి తన నుండి దూరమైన శ్రీలక్ష్మిని ఆనంద్ ఎలా మళ్లీ దక్కించుకున్నాడు. మధ్యలో ఆనంద్ కు ఎదురైన సవాళ్లు ఏంటన్నది సినిమా కథ.
2
నటీనటుల ప్రతిభ :

ఆనంద్ పాత్రలో ఆదిత్ అరుణ్ బాగానే చేశాడు. ఇక హెబ్భా పటేల్ మరోసారి తన మార్క్ చూపించింది. రొమాంటిక్ సీన్స్ లో లీడ్ పెయిర్ ఆడియెన్స్ ను అలరించారు. ఘాటు ముద్దులతో ఇద్దరు కేక పెట్టించారు. డాక్టర్ గా రావు రమేష్ తన పరిధి మేరకు నటించాడు. ఇక మిగతా పాత్రలన్ని సహజంగానే చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫీ బాగుంది. లవ్ అండ్ ఎమోషనల్ క్యారీ చేసే సీన్స్ బాగున్నాయి. కెమెరా వర్క్ వరకు బాగానే ఉంది. జోయ్ బారా మ్యూజిక్ సోసోగానే ఉంది. దర్శకుడు అయోధ్యా కుమార్ కథ, కథనాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. రొటీన్ కథ సాగదీసిన కథనం ఆడియెన్స్ కు బోర్ కొట్టిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గానే ఉన్నాయి.
1
విశ్లేషణ :

24 కిస్సెస్ అని చెప్పి దర్శకుడు ఓ రొటీన్ లవ్ స్టోరీతోనే సినిమా నడిపించాడు. ముద్దులతో సినిమాని ప్రమోట్ చేయడం వరకు బాగానే ఉన్నా అందుకు తగిన కంటెంట్ సినిమాలో ఉండేట్టుగా జాగ్రత్త పడాల్సింది. ముఖ్యంగా సినిమా స్క్రీన్ ప్లే అసలేమాత్రం ఆకట్టుకోలేదు. సినిమా అంతా సాగదీసినట్టుగా అనిపిస్తుంది.

దర్శకుడు అయోధ్యా కుమార్ కథ, కథనాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. లీడ్ పెయిర్ మధ్య రొమాన్స్ తప్ప సినిమాలో అసలు మ్యాటర్ ఏం లేదు. సినిమా అంతా కన్ ఫ్యూజ్ గా సాగుతుంది. హీరో క్యారక్టరైజేషన్ విషయంలో ఇంకా క్లారిటీగా రాసుకోవాల్సి ఉంది. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా అంతగా మెప్పించలేదు.

ప్లస్ పాయింట్స్ :

రొమాంటిక్ సీన్స్

హెబ్భా పటేల్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

స్టోరీ

స్క్రీన్ ప్లే

స్లో నరేషన్

బాటం లైన్ :

24 కిస్సెస్.. ముద్దులు తప్ప ఇంకేం లేదు..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news