ఒకప్పుడు టెస్టులు, వన్ డేల రికార్డుల గురించి మాట్లాడుకునే జనం టి20ల్లో ఒక ఓవర్ లో ఎంత కొట్టాడు. ఎంత ఎక్కువ స్కోర్ చేశాడని లెక్కలేసుకుంటున్నారు. షార్ట్ టర్మ్ మ్యాచ్ లు వచ్చిన దగ్గర నుండి ఈ రకమైన రికార్డులకు ఎక్కువ క్రేజ్ పెరిగింది. టి20 కాదు టి10 కూడా ఇప్పుడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
ప్రస్తుతం జరుగుతున్న టి10 సీరీస్ లో భాగంగా సింధీస్ వర్సెస్ రాజ్ పుత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేవలం 4 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు షాజద్. మొదట సింధీస్ బ్యాటింగ్ చేయగా 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్ కు దిగిన రాజ్ పుత్ బ్యాటింగ్ లో మహ్మద్ షాజద్ 16 బాల్స్ లో 74 పరుగులు చేశాడు. 8 సిక్సులు, 6 ఫోర్లతో ప్రపంచమంతా తన వైపు చూసేలా చేసుకున్నాడు షాజద్. ఆఫ్ఘాన్ ఆటగాడే అయినా 16 బాల్స్ లో 74 పరుగులతో ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
ఒక్క మ్యాచ్ తో ప్రపంచ రికార్డ్ ని తిరగరాసిన ఆఫ్ఘాన్ ఆటగాడు..
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి