విండీస్ : 104 ఆల్ అవుట్.. కష్టాల్లో భారత్ ఓపెనర్స్..?

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా జరగతున్న చివరి వన్డేలో విండీస్ జట్టు తడబడుతోంది. చివరి వన్డేలో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కీరన్ పావెల్ (0) డకౌట్ అయ్యాడు. భువి బౌలింగ్ లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫామ్ లో ఉన్న షాయ్ హోప్ (0) కూడా ఐదు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్ లో నాలుగో బంతికి హోప్ డకౌట్ అయ్యాడు. రెండు పరుగులకే రెండు ప్రధాన వికెట్లను విండీస్ కోల్పోయింది.

సీనియర్ బ్యాట్స్ మెన్ మార్లొన్ శామ్యూల్స్ (24), హెట్మయెర్ (9) వికెట్లలను కోల్పోయింది. శామ్యూల్స్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగా.. హెట్మయెర్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. దీంతో విండీస్ మరింత కష్టాల్లో పడింది. విండీస్ 31 . 5 ఓవర్లలో 104 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.
ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కిరణ్ పావెల్ వికెట్ తీసి వన్ డేల్లో 99 వ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు, పావెల్ ఖాతా తెరవకుండానే అవుట్ అవ్వటంతో వన్ డేల్లో 1000 పరుగుల మైలురాయి సాధించే ఘనత కొద్దిలో కోల్పోయాడు. పావెల్ ప్రస్తుతం వన్ డేల్లో 995 పరుగులు సాధించాడు.

ఇక 105 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగిన భారత్ అది లోనే ధావన్ (6 ) వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 10.2 ఓవర్లలో 62 పరుగులు చేసింది. క్రిజులో రోహిత్ శర్మ ( 30 ), కోహ్లీ ( 23 ) బ్యాటింగ్ చేస్తున్నారు.