రోజు రోజుకి దేశంలోని మహిళలకు బధ్రత లేకుండా పోతుంది. అవసరం అని వచ్చిన మహిళలను తమ అవసరాలకు వాడుకునేలా చూస్తున్నారు. రోజుకి ఇలాంటి సంఘటనలు దేశంలో ఎక్కడో ఒక చోట జరుగుతుండగా లేటెస్ట్ గా బెంగళూరులో ఓ బ్యాంక్ మేనేజర్ తన పై చేసిన అసభ్య ప్రవర్తనకు ఓ మహిళ భలే బుద్ధి చెప్పింది.
కర్ణాటకలోని దేవనగిరి పట్టణానికి చెందిన మహిళ అక్కడ ఉన్న డి.హెచ్.ఎఫ్.ఎల్ లో 2 లక్షల రూపాయల్ లోన్ కు అప్లై చేసింది. ఆమె మీద కన్నేసిన మేనేజర్ దేవయ్య ఆమెను ఇంటికి రమ్మన్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం వెళ్లిన మహిళ మేనేజర్ దేవయ్య మాటలన్ని సెల్ ఫోన్ లో బంధించడమే కాకుండా ఆ మేనేజర్ ను అతని ఇంటి బయటే బడిత పూజ చేసింది.
మహిళతో పాటు వచ్చిన వ్యక్తి మేనేజర్ ను కొడుతుంటే వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తనపై కన్నేసిన మేనేజర్ ను కుళ్లబొడిచిన ఆ మహిళ ధైర్య సాహసాలకు అందరి శభాష్ అంటున్నారు.