ఆరెక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన భామ పాయల్ రాజ్ పుత్. ఒక్క సినిమాతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఈ అమ్మడు మరో రెండు సినిమాలు చేస్తుంది. ఆరెక్స్ సినిమా సక్సెస్ ను అవకాశాల రూపంలో మార్చుకోవడమే కాకుండా టాలీవుడ్ ఈవెంట్ లలో పాల్గొంటూ ఇక్కడే కెరియర్ స్ట్రాంగ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది పాయల్ రాజ్ పుత్.
ఇక లేటెస్ట్ గా ఓ గేం షోలో భాగంగా రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో విజయ్ దేవరకొండతో పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఈ అమ్మడు. యువ హీరోల్లో విజయ్ సూపర్ ఫాం లో ఉన్నాడు. అతనంటే హీరోయిన్స్ కు భలే క్రేజ్. రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండని ఇష్టపడే భామలు ఎక్కువయ్యారు.
వారి లిస్ట్ లో పాయల్ కూడా చేరింది. విజయ్ ఒప్పుకుంటే తనను పెళ్లాడేందుకు తాను సిద్ధం అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది పాయల్. తన స్కిన్ షోతో ఆరెక్స్ 100 సినిమా సూపర్ హిట్ కొట్టిన పాయల్ రియల్ లైఫ్ రిలేషన్ ఏమో కాని రీల్ లైఫ్ లో జోడి కడితే సెన్సేషనే అని చెప్పొచ్చు.