విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా నోటా. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓటింగ్ సిస్టెం లో నోటా అనేది ఒక ఆప్షన్ ఉంటుందని.. అయితే సినిమా కథ, ఎమోషన్స్ ఆధారంగా ఆ టైటిల్ పెట్టామే తప్ప తాను నోటాకు వ్యతిరేకం అని అన్నాడు విజయ్ దేవరకొండ.
రాష్ట్ర, జాతీయ రాజకీయాల ప్రస్థావన ఉంటుంది. అయితే తాము సినిమా ద్వారా నోటాని ఎంచుకోమని చెప్పమని అంటున్నాడు విజయ్. కేవలం తెలుగులో తీద్దామని వచ్చిన మేకర్స్ కు యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి తమిళంలో కూడా ఈ సినిమా చేస్తే బాగుంటుందని తానే సలహా ఇచ్చానని చెప్పాడు విజయ్. ఈ సినిమాతో తమిళంలో అడుగుపెడుతున్న విజయ్ సినిమా డబ్బింగ్ కోసం తాను చాలా కష్టపడినట్టు చెప్పుకొచ్చాడు.
తెలుగు డబ్బింగ్ 10 నిమిషాల్లో పూర్తి చేయగా తమిళ డబ్బింగ్ దాదాపు 3 రోజుల దాకా పట్టిందని అన్నాడు. విజయ్ సరసన మెహ్రీన్ కౌర్ నటించిన ఈ నోటాతో విజయ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. గీతా గోవిందం తర్వాత విజయ్ నటిస్తున్న ఈ సినిమాపై బాభత్సమైన క్రేజ్ ఏర్పడింది.