Gossips"వీర భోగ వసంత రాయలు" రివ్యూ & రేటింగ్

“వీర భోగ వసంత రాయలు” రివ్యూ & రేటింగ్

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రీయా శరణ్ ప్రధాన పాత్రలుగా ఇంద్రసేన డైరక్షన్ లో వచ్చిన మూవీ వీర భోగ వసంత రాయలు. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ అయిన సుధీర్ బాబు, నారా రోహిత్, శ్రీయాలు ఓ మిస్టరీని ఛేధించేలా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. హౌజ్ మిస్సింగ్ కేసులో ఒకరు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా.. మరో పక్క శ్రీలంక్ వెళ్తున్న ఫ్లైట్ మిస్సింగ్ కేసు వస్తుంది. దీనితో పాటుగా హైదరాబాద్ లో ఓ అమ్మాయి మిస్సింగ్ కేసు ఫైల్ అవుతుంది. ఈ మూడు మిస్టరీలు ఒకే సమయంలో జరుగుతాయి. ఆ మిస్టరీలను ఛేధించడానికి ముగ్గురు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం చేశారు.. అసలు ఈ మూడింటికి ఎలాంటి సంబంధం ఉంది..? ఈ మిస్టరీలకు ప్రధాన కారకుడు ఎవరు..? అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.
నటీనటుల ప్రతిభ :

నారా రోహిత్, సుధీర్ బాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రీ విష్ణు డిఫరెంట్ రోల్ లో కనిపించి అలరించాడు. శ్రీయా కూడా బాగానే చేసింది. అయితే దర్శకుడు పాత్రలు రాసుకోవడం విఫలమయ్యాడు. భారీ స్టార్ కాస్ట్ ఉన్నా ఏమంత ఉపయోగం లేకుండా పోయింది.

సాంకేతికవర్గం పనితీరు :

కెమెరా మెన్ పనితనం బాగుంది. మ్యూజిక్ ఓకే అన్నట్టుగా ఉంది. కథ, కథనాలు దర్శకుడు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాడు. ఏమాత్రం లాజిక్ లేని కథ, కథనంతో వచ్చాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

విశ్లేషణ :

క్రైం ఇన్వెస్టిగేషన్ మూవీలను డీల్ చేయాలంటే మొదటి నుండి దానికి స్క్రీన్ ప్లే బాగా రాసుకోవాలి. వీర భోగ వసంత రాయలు సినిమా విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనాలతో ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. అసలు ఈ కథని ఏం చెప్పి దర్శకుడు రోహిత్, సుధీర్ లను ఒప్పించాడా అని డౌట్ వస్తుంది.

కేవలం చివరి 15 నిమిషాల సీన్ కోసం సినిమా అంతా సాగదీసినట్టు అనిపిస్తుంది. నారా రోహిత్, సుధీర్ బాబులు ఉన్నా సరే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. డిఫరెంట్ జానర్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ కోసం ఈ సినిమా చేశారా అన్న ఆలోచన వచ్చినా సినిమా కోసం పెట్టిన శ్రమ అంతా వృధా అయ్యిందని చెప్పొచ్చు.

దర్శకుడు కథ మీద ఇంకాస్త వర్క్ చేసి కథనం సరిగా రాసుకుని ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

క్లైమాక్స్

కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్ :

కథ

కథనం

ప్రొడక్షన్ వాల్యూస్

బాటం లైన్ :

వీర భోగ వసంత రాయలు.. ఓ వృధా ప్రయత్నమే కానీ చివరి 15 నిమిషాల కోసం చూడొచ్చు..!

రేటింగ్ : 2.5/5

https://youtu.be/KT6875hyV1U

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news