ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దసరా రోజున ప్రెస్ మీట్ పెట్టి మరి సినిమా ప్రారంభిస్తానని చెప్పిన వర్మ సినిమా షూటింగ్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నారట. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాను వర్మ చాలా సీక్రెట్ గా షూట్ చేస్తున్నాడని తెలుస్తుంది.
అంతేకాదు ఇదవరకు తన సినిమాల విషయంలో ఎక్కువగా అసిస్టెంట్స్ మీద ఆధారపడే వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాకు మాత్రం అంతా దగ్గర ఉండి చూసుకుంటున్నాడట. అంతేకాదు సినిమా షూటింగ్ కూడా కట్టుదిట్టమైన భద్రతలతో జరుగుతుందట. ఎన్.టి.ఆర్ అసలు జీవిత చరిత్ర ఇదే అని.. ఆయన ఆశీస్సులు తన సినిమాకే ఉంటాయని చెబుతున్న వర్మ ఈ సినిమాతో సంచలనం సృష్టిస్తాడని మాత్రం తెలుస్తుంది.
బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులుగా వస్తుంది. ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఒకటి కాగా.. మహానాయకుడుగా మరో పార్ట్ వస్తుంది. అయితే జనవరి 24న వస్తున్న ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాకు పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.