Gossipsతన సినిమాల్లో రేప్ సీన్స్ పై త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్..

తన సినిమాల్లో రేప్ సీన్స్ పై త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్..

తెలుగు సినీ ఇండ్రస్ట్రీలో మాటల మాంత్రికుడిగా … పంచ్ లు, ప్రాసలతో అందరిని ఆకట్టుకునే టాప్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ చక్రం తిప్పుతున్నాడు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా అతని చిత్రాల్లో నటించడానికి మన హీరోలంతా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ స్టార్ డైరెక్టర్‌లోనూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఆయన చెప్పిన బలహీనతలు ఏంటంటే… ? త్రివిక్రమ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అనే సందేహం అందరికి వస్తుంది. ఒక్కో దర్శకుడుకి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. దాని ప్రకారమే ఫాలో అయిపోతుంటారు. మరి త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఉన్న సెంటిమెంట్స్ ఏంటంటే.. ? ఈయన సినిమాల్లో చిన్న పిల్లల్ని బాధపెట్టే సన్నివేశాలు.. రేప్ సీన్లు తెయలేదట. అంతే కాదు పిల్లల విషయంలో తాను చాలా సెన్సెటివ్ అని త్రివిక్రమ్ అంటున్నాడు. ఆయనే కాదు ఇంకా వేరే దర్శకులు కూడా పిల్లల్ని బాధ పెట్టే సీన్లు తీస్తే తాను చూడాలనేనని చెబుతున్నాడు.

నయనతార నటించిన ‘కర్తవ్యం’ అనే సినిమా చాలా బాగుందని చాలామంది చెప్పారని.. అందులో పిల్లాడు బోరుబావిలో పడిపోతాడని.. ఈ సినిమా మొదలుపెట్టి ఒక 15 నిమిషాలు అవ్వగానే తాను ఆపేశానని.. అలాంటివి చూడటం తన వల్ల కాదని త్రివిక్రమ్ చెప్పాడు. అంతే కాదు మీడియాలో కూడా ఇటువంటి వార్తలు చదవడానికి కానీ, వినడానికి కానీ నా మనసు అంగీకరించాడని చెపుతున్నాడు ఈ మాటల మాంత్రికుడు.

ఇక పవన్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పిల్లాడి తల్లి చనిపోయే సీన్ ఉంటుందని, ఆ పాత్రలో నటించిన పిల్లాడికి ఇదీ సీన్.. ఇలా చెయ్యమని తాను చెప్పలేకపోయానన్నాడు. పిల్లలకు అలాంటి బాధాకరమైన విషయాలకు ఎందుకు అలవాటు చేయాలని అనిపించిందని.. అందుకే ఆ రోజు మధ్యాహ్నం రెయిన్ ఎఫెక్ట్ పెట్టించి ఆ పిల్లవాడు ఏడుస్తున్నట్టు కవర్ చేసానని తన బలహీనతలను గురించి చాలా ఎమోషనల్ గా చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news