ఓడలు బళ్ళు .. బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఎలాగో మనం నిత్య జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాము. అనుకోని మలుపులు తిరగడమే జీవితం. ఇక సినిమా వాళ్ల జీవితాలు చూసుకున్నా దాదాపు ఇలాగే కనిపిస్తుంటాయి. జూదం వంటి ఈ సినీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే హిట్టు సినిమాలు పడాల్సిందే. వరుసపెట్టి ప్లాపులు పలకరిస్తే… ఇక వెంటవెంటనే ఆర్ధిక కష్టాలు కూడా మొదలయిపోతాయి. ఇప్పుడు ఇలాంటి కష్టమే ఒక తెలుగు, తమిళ సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యువ కధానాయకుడు ఎదుర్కొంటున్నాడు.
ఈ హీరో దాదాపు అన్నీ స్వంత సినిమాలే చేసుకోవడం, వాటిల్లో హిట్ లు తక్కువ వుండడంతో ఆర్థిక చిక్కుల్లో పడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.కొంతకాలం క్రితం సదరు హీరో నిర్మించిన ఓ సినిమా మంచి హిట్ అయింది. కానీ ఆ సినిమా విడుదలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నారు. ఆ సమయంలోనే ఇష్టమొచ్చినట్టు అందరి దగ్గర అడ్వాన్స్ లు తీసేసుకున్నట్లు తెలుస్తోంది. అలా ఇచ్చిన వారిలో భోగవిల్లి ప్రసాద్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ వంటి పెద్ద సంస్థలు కూడా ఉన్నట్టు సమాచారం.
సదరు హీరో అడ్వాన్స్ లు తీసుకున్న ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు ప్రారంభమే కాలేదట. ఒక నిర్మాత అయితే సుమారు తొమిది కోట్ల రూపాయలు ముట్టజెప్పినట్టు సమాచారం. వీటన్నికంటే ముందుగా ఆ హీరో నటించి నిర్మించిన చిత్రం విడుదల అవ్వడానికి అనేక కష్టాలు ఎదుర్కుంటుందట. అవ్వన్నీ క్లియర్ అయితే కానీ అడ్వాన్స్ తీసుకున్న సినిమాలు మొదలయ్యే అవకాశం కనిపించకపోవడంతో ఇప్పుడు నిర్మాతలు లబోదిబోమంటున్నారు. పాపం ఆ హీరో గారు ఆర్ధిక కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఏంటో !