బాహుబలి తరువాత దర్శకధీరుడు రాజమౌళి ఏ సినిమాతో వస్తాడా అని ఎదురుచూసిన జనానికి #RRR రూపంలో యాన్సర్ లభించింది. అయితే ఈ సినిమాను అనుకున్నప్పట్నుండీ ఇప్పటివరకు అఫీషియల్‌గా ఎలాంటి అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. కాగా ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్, చరణ్‌లు యుఎస్ వెళ్లి స్క్రీనింగ్ టెస్ట్ చేసి వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ నెలలో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తొలి షెడ్యూల్‌లోనే ఏకధాటిగా 45 రోజుల షూటింగ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఒక భారీ సెట్‌లో ఈ షెడ్యూల్ జరగనుండగా ఇది ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందొచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ అంటున్నారు.
డివివి దానయ్య ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రొడ్యూస్ చేస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్ల కోసం ఇంకా వేట కొనసాగుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.