” 2.0 ట్రైలర్ ” వచ్చేసిందోచ్..!

సూపర్ స్టార్ రజినికాంత్, క్రేజీ డైరక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టిజియస్ మూవీ 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నవంబర్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈమధ్యనే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా సినిమా ట్రైలర్ రిలీజ్ కు రంగం సిద్ధం చేశారు.

నవంబర్ 3న తెలుగు, తమిళ, హింది భాషల్లో ఒకేసారి 2.ఓ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగబోతుందని తెలుస్తుంది. ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేలా ఉంటుందని చెబుతున్నారు. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రజినికి ప్రతి నాయకుడిగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.

ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రోబో సీక్వల్ గా భారీ హైప్ తో వస్తుంది. మరి ఈ ట్రైలర్ హంగామా ఎలా ఉండబోతుందో చూడాలంటే మరో వారం వెయిట్ చేయాల్సిందే.

Leave a comment