తమ ఫ్యాన్స్ తో డైరెక్ట్ కాంటాక్ట్ ఏర్పాటు చేసుకోటానికి సెలెబ్రెటీలంతా ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ మీద బాగా అలవాటుపడుతున్నారు. సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ అంశం జనానికి క్రేజీగా కనిపిస్తుంది. ఇదే అదునుగా భావించి హ్యాకర్లు సెలెబ్రెటీల సోషల్ నెట్వర్కింగ్ అక్కౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. అలా చేసి అందులో తమకు నచ్చినట్టు కామెంట్స్ చేయటం, ప్రైవేట్ మెసేజ్ లు పెట్టడం ఈ మధ్య ఎక్కువైపోయింది. దీని వల్ల ఆ సెలబ్రిటీ పరువు బజారునపడుతోంది.
తాజాగా టాలీవుడ్ లో టాప్ క్రేజీ హీరోయిన్ గా చెలామణి అవుతున్న రకూల్ ప్రీతీ సింగ్ ఇన్ స్టిగ్రామ్ అకౌంట్ హ్యగింగ్ కి గురయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. హే అబ్బాయిలు ! నా ఇన్ స్టిగ్రామ్ ఖాతా హ్యాక్ చేయబడింది! దయచేసి ఆ అకౌంట్ నుంచి ఏవైనా లింకులు లేదా సందేశాలు వచ్చినా స్పందించకండి త్వరలోనే ఆ అకౌంట్ రికవరీ అవుతుంది ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది.
Hey guys !! My Instagram account has been hacked ! Please do not respond to any links or messages till it’s recovered !! Thanks
— Rakul Preet (@Rakulpreet) October 24, 2018