నాచురల్ స్టార్ నాని ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రేజ్ తెచ్చుకోగా శ్రీరెడ్డి లాంటి వారు అతన్ని ఒకేసారి దిగజార్చే పని చేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ మీద యుద్ధం ప్రకటించి ఆ తర్వాత పవన్ మీద తన అస్త్రాన్ని వేసిన శ్రీరెడ్డి కొన్నాళ్లుగా నాని మీద విపరీతమైన నెగటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చింది. అయితే కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్నట్టు కనిపించిన శ్రీ రెడ్డి మళ్లీ నాని మీద తన విపరీతమైన ధోరణి ప్రదర్శించింది.
బిగ్ బాస్ పూర్తయిన సందర్భంగా నాని మీద తన అక్కసు చూపించింది శ్రీ రెడ్డి. నాని మీద వ్యక్తిగత విమర్శలకు దిగిన శ్రీరెడ్డి ప్రస్థావించలేని విధంగా కామెంట్స్ చేసింది. ముఖ్యంగా బెడ్ మీద నాని ఓపిక తక్కువ అన్న పదం మరి దారుణం. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి మళ్లీ నానిపై ఇలా తన ప్రతాపం చూపించడానికి గల కారణాలేంటో తెలియాల్సి ఉంది.
శ్రీ రెడ్డి కామెంట్స్ కు నాని ఎలాంటి రెస్పాన్స్ అందిస్తాడో తెలియాల్సి ఉంది. తన మీద కేసు వేసినట్టుగా అప్పట్లో హడావిడి చేయగా మళ్లీ అమ్మడు విజృంభించింది అంటే ఇక ఇప్పుడు నాని కచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చిందని చెప్పాలి.