Gossipsసినిమాలకు దూరమవుతున్న ఎన్టీఆర్...షాక్ లో ఫ్యాన్స్..!

సినిమాలకు దూరమవుతున్న ఎన్టీఆర్…షాక్ లో ఫ్యాన్స్..!

తండ్రి మరణించినా సరే అనుకున్న టైం కు సినిమా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఐదోరోజునే షూటింగ్ కు వచ్చాడు ఎన్.టి.ఆర్. ఆ తర్వాత నెల రోజులు డే అండ్ నైట్ షూటింగ్ లో పాల్గొన్న ఎన్.టి.ఆర్ సినిమా ఎలాగోలా పూర్తి చేశాడు. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే అసలైతే రాజమౌళి సినిమా చేయాల్సి ఉంది.
2
కాని ఎన్.టి.ఆర్ అరవింద సమేత తర్వాత కొంత గ్యాప్ తీసుకోవాలని చూస్తున్నాడట. రాజమౌళి మల్టీస్టారర్ కు ఇప్పుడప్పుడే ఎన్.టి.ఆర్ డేట్స్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లాలని అనుకున్న ఆ ప్రాజెక్ట్ కాస్త లేటవనుందట. అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఎన్.టి.ఆర్ తప్పుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఓ 6 నెలలు ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా ఉండాలని చూస్తున్నాడట.
1
తండ్రి మరణాన్ని ఇప్పటికి జీర్ణించుకోలేని తారక్ రీసెంట్ గా జరిగిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల ముందే బోరున ఏడ్చేశాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని తర్వాత సినిమా చేద్దామని అనుకుంటున్నాడట.

Latest news