అరవింద సమేతకు కేటిఆర్ వెన్నుపోటు.. తెలంగాణాలో అన్యాయం..!

KTR shock to Aravindha sametha

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా మరికొద్ది గంటల్లో మొదటి షో పడనుంది. అయితే ఏపిలో టిడిపి ప్రభుత్వం ఈ సినిమాకు అండగా నిలిచింది. స్పెషల్ గా రోజు వేసే నాలుగు ఆటలకు అదనంగా మరో రెండు షోలకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు టికెట్ ప్రైజ్ 200 చేసింది.

ఏపిలో ప్రతి థియేటర్ లో 6 షోలు వేస్తున్నారు. అంటే ఉదయం 5 గంటలకే అక్కడ మొదట ఆట మొదలవుతుంది. తెలంగాణాలో మాత్రం ఈ సినిమాకు అలాంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. హైదరాబాద్ వంటి సిటీస్ లో కూడా మిడ్ నైట్ షోస్ కు పర్మిషన్ ఇవ్వలేదు. అంతేకాదు తెలంగాణాలో ఏ ఒక్క థియేటర్ కు అదనపు షో పర్మిషన్ ఇవ్వలేదు.

ఇది కచ్చితంగా అరవింద సమేత మీద తెలంగాణా నిన్నటిదాకా అధికారంలో ఉన్న ప్రభుత్వం పెంచుకున్న కథ అని తెలుస్తుంది. స్పెషల్ ఆట ఆపొచ్చేమో కాని అరవింద సమేత వీర రాఘవ విధ్వసాలను మాత్రం ఏ ఒక్కరు ఆపలేడని అంటున్నారు నైజాం నందమూరి ఫ్యాన్స్.

Leave a comment