హలో గురు ప్రేమ కోసమే అంటూ… రామ్ కొత్త రకమైన కథనంతో ముందుకొచ్చాడు. ఈ సినిమాపై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ చిత్రం అక్టోబర్ 18 న ప్రెకషకుల ముందుకు వచ్చింది. తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టగా ఐదో రోజు రూ.1.30 కోట్ల షేర్ తో కాస్త నిరాశపరిచింది.
కెరీర్‌లో వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో హీరో రామ్ పోతినేనికి ఈ సినిమా కీలకంగా మారింది. ప్రకాశ్ రాజ్‌తో కలిసి రామ్ కొత్త రకమైన కథనంతో ముందుకొచ్చాడు. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మొత్తానికి రామ్ కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్లు ఈ సినిమా రాబట్టింది. ఇక ఈ సినిమాకు సంబంధించి 5 రోజులకుగాను రూ.14.70కోట్ల షేర్ వసూళ్లను సాధించింది.
ఇక ఆంధ్రాలో సినిమా కలెక్షన్లు యావరేజ్‌గా ఉన్నాయని తెలుస్తున్నది. ఈ చిత్రానికి వైజాగ్ లాంటి సెంటర్లలో పెద్దగా స్పందన లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో హలో గురూ ప్రేమ కోసమే థియెట్రికల్ రైట్స్‌ను రూ.20 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే … వసూళ్లు మరింత పుంజుకోవాల్సిందే. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించగా ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, సితార, జయ ప్రకాష్ నటించారు. త్రినాధ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
” హలో గురు ప్రేమ కోసమే ” 5 డేస్ కలెక్షన్స్..టెన్షన్ లో బయ్యర్లు..
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి