అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ ఎమోషనల్ స్పీచ్ కేవలం నందమూరి ఫ్యాన్స్ ను మాత్రమే కాదు ప్రతి సిని అభిమాని మనసు కదిలించింది. తండ్రి చెప్పిన మాటలను గురించి ప్రథావిస్తూ ఎన్.టి.ఆర్ మాటలు ఫ్యాన్స్ ను కన్నీరు పెట్టేలా చేశాయి. ఇక స్టేజ్ మీద తన అభిమానుల ముందు చిన్న పిల్లాడిలా ఏడుస్తూ మాట్లాడిన ఎన్.టి.ఆర్ ను చూసి అందరు షాక్ అయ్యారు.
అయితే ఈ విషయంపై మెగా హీరో రాం చరణ్ స్పందించారు. ఎన్.టి.ఆర్ అలా నువ్వు ఏడుస్తుంటే తాను చూడలేకపోయానని.. నీకు ఎప్పుడు మేము అండగా ఉంటాం. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ మెసేజ్ పెట్టాడు. చరణ్ పెట్టిన ఈ మెసేజ్ అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ మధ్య మంచి వాతావరణాన్ని ఏర్పరచేలా చేసింది.
త్వరలో చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి రాజమౌళి మల్టీస్టారర్ లో నటించబోతున్నారు. ట్రిపుల్ ఆర్ అంటూ రాజమౌళి సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఎన్టీఆర్ ఆవేదనపై చరణ్ అనూహ్య స్పందన..
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి