యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా దసరాకు ఎన్నో భారీ అంచనాలతో వచ్చింది. ఫ్యాక్షన్ కథలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చేలా సినిమా కథను కొత్తగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు త్రివిక్రం. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ అంచనాలకు తగినట్టుగా వచ్చిన ఈ సినిమా వసూళ్లు బాగానే ఉన్నాయి.
అయితే సినిమాపై విపరీతమైన అంచనాలు ఉండటం వల్ల కొన్ని చోట్ల బిజినెస్ ఊహించని విధంగా జరిగింది. అయితే బిజినెస్ అయితే బాగున్నా దానికి తగినట్టుగా కలక్షన్స్ మాత్రం రాబట్టడం లేదు. అలా బయ్యర్లను ముంచేలా అరవింద సమేత పరిస్థితి ఉందని అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్ షేర్ వరకు లాభాలు వచ్చినట్టు తెలుస్తున్నా కొన్ని చోట్ల నష్టాలు తప్ప్లేలా లేవని తెలుస్తుంది.
ఏరియాల వారిగా అరవింద సమేత లేటెస్ట్ వసూళ్ల వివరాలు..
నైజాం : 21.67 కోట్లు
సీడెడ్: 16.38 కోట్లు
ఉత్తరాంధ్ర : 8.88 కోట్లు
ఈస్ట్ : 5.85 కోట్లు
వెస్ట్ : 4.80 కోట్లు
కృష్ణా : 4.99 కోట్లు
గుంటూర్ : 7.98 కోట్లు
నెల్లూరు : 2.82 కోట్లు
ఏపి/తెలంగాణ: 73.37 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 14.22 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 11.90 కోట్లు
వరల్డ్ వైడ్ : 99.49 కోట్లు