యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత అంచనాలను మించి వసూళ్లను రాబడుతుంది. కమర్షియల్ సినిమానే అయినా కంటెంట్ ఫుల్ గా వచ్చిన ఈ సినిమా వసూళ్ల హంగామా మాములుగా లేదు. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దుమ్ముదులిపిన వీర రాఘవ.. 11వ రోజు కూడా తన ప్రతాపం చూపించాడు.
ఏపి, తెలంగాణాలో పదకొండోవ కూడా 2.10 కోట్ల షేర్ రాబట్టింది అరవింద సమేత వీర రాఘవ. ఇక 11 రోజుల టోటల్ కలక్షన్స్ విషయానికొస్తే.. ఏపి/తెలంగాణాలో 11 రోజుల్లో 68.82 కోట్ల షేర్ వసూళు చేసింది ఈ సినిమా. ఓవర్సీస్ లో ఇప్పటికే 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసి అక్కడ కూడా ఎన్.టి.ఆర్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా దూసుకెళ్తుంది అరవింద సమేత. చాలా చోట్ల బాహుబలి 1 రికార్డులను బ్రేక్ చేసింది అరవింద సమేత.
ఇక ఏరియాల వారిగా అరవింద సమేత 11 రోజుల కలక్షన్స్ వివారాలు ఇలా ఉన్నాయి..
నైజాం : 20.25 కోట్లు
సీడెడ్ : 15.82 కోట్లు
ఉత్తరాంధ్ర : 8.02 కోట్లు
ఈస్ట్ : 5.28 కోట్లు
వెస్ట్ : 4.56 కోట్లు
కృష్ణా : 4.73 కోట్లు
గుంటూరు :7.68 కోట్లు
నెల్లూరు : 2.48 కోట్లు
ఏపి/తెలంగాణ : 68.82 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా: 13.71 కోట్లు
రెస్ట్ అఫ్ వరల్డ్: 8.52 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్: 91.05 కోట్లు