ముగింపు రాసుకున్న తరువాతే కథ మొదలుపెట్టాలి అని విలన్ చెప్పే మాటలు.. మనకు నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉండే బలం.. అంటూ రవితేజ చెప్పిన డైలాగ్‌లతో ‘అమర్ అక్బర్ ఆంటొని’ టీజర్ ఆకట్టుకునేలా రూపొందించారు. ఈ ట్రీజర్ చూస్తుంటే ఈ సినిమాలో ఏదో తెలియని సస్పెన్స్, ట్విస్ట్ లు ఉండేలా కనిపిస్తోంది.
ఇక తరువాత మాస్ మహారాజ్ రవితేజ చాలా కాలంగా సరైన హిట్టు సినిమాలు లేక కెరియర్ పై నీలి నీడలు కమ్ముకున్న రవితేజ ఈ సినిమాతో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చే అవకాశాలు ఈ ట్రీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఈ విధంగానే ఎన్నో సూపర్ డూపర్ హిట్టు సినిమాలతో ఆకట్టుకున్నదర్శకుడు శ్రీను వైట్ల కూడా వరుస ప్లాప్ సినిమాలతో సతమతం అవుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ద్వారా హిట్టు కొట్టడం ఇద్దరికీ అత్యవసరము. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సినిమా కోసం కష్టపడినట్టు అర్ధం అవుతోంది.
ఇక ‘కిక్’ సినిమాతో హిట్ కొట్టిన ఇలియానా ఈ సినిమాలో హెరాయిన్ గా నటిస్తుండడం ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.