ముద్దుల వర్షంలో తడిపేస్తున్న ” 24 కిస్సెస్ ” ట్రైలర్ !

‘మిణుగురులు’ వంటి సందేశాత్మకంగా సినిమాను డైరెక్ట్ చేసిన అయోధ్యకుమార్ దర్వకత్వంలో అందాల భామ హెబ్బా పటేల్, అరుణ్ జంటగా ‘24 కిస్సెస్’ అంటూ ముద్దుల వర్షం కురిపిస్తున్న ట్రైలర్ కుర్రకారు మతులు పోగొడుతోంది. ‘24 కిస్సెస్’ సినిమా ఉపశీర్షిక ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’. దీనికి తగ్గట్టుగానే మూవీలో ముద్దుల మసాలా ఘాటు ఎక్కువగా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. హెబ్బా పటేల్ తనదైన అందచందాలను ఆరబోస్తూ ఈ సినిమా మీద రొమాంటిక్ ఫీల్ కుర్రకారుకి చూపించేందుకు సిద్ధం అవుతోంది.

‘అల తానై అలరించేది మగువా.. తనువు తానై మురిపించేది మగువా.. ఒడి తానై మనిషినే మలిచేది మగువా.. నింగినైనా.. నేలనైనా అమూల్యమైనది మగువా..’ అంటూ ప్రేమదేశంలోని సూపర్ హిట్ పాట ఈ సినిమాలోని హీరో తో పాటు రావు రమేష్ పాడడం ఈ ట్రైలర్ లో చూపించారు. అంతే కాదు హెబ్బా పటేల్‌, అరుణ్ మధ్య సన్నివేశాలు హాట్ హాట్‌గా ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.

ఫస్ట్ కిస్ అంటూ మత్తెక్కిస్తున్న హీరో అదిత్.. ‘కానీ, అది నాకు కాదు.. తనకు’ అంటూ కవ్విస్తుండగా.. ‘ఇంతకీ నువ్ నన్ను ప్రేమిస్తున్నావా? లేదా?’ అంటూ హీరోయిన్ నిలదీస్తోంది. ‘అన్ని బంధాలకు ఏదో ఒక పేరు పెట్టాల్సిందేనా’ అంటూ అదిత్‌ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ‘నాకు సినిమాలంటే చాలా ఇష్టం.. సినిమా కన్నా జీవితం అంటే ఇష్టం.. జీవితం కన్నా శ్రీలక్ష్మి అంటే..’ అంటూ తన ప్రియురాలిపై ఉన్న ఇష్టాన్ని చెబుతూ హీరో మరింత ఆసక్తి కలిగిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాలో అందాల ఆరబోత ఎక్కువందనో ఏమో కానీ సెన్సార్ బోర్డు వారు ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చారు . నవంబర్ 15న ప్రేక్షకులను ముద్దుల వర్షంలో తడిపేందుకు సిద్ధం అవుతోంది.

Leave a comment