అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ యాసతో మాట్లాడుతుంటే ఆ బాషకే అందం వచ్చిందని అందరూ రాయలసీమ వాసులు అందరూ తెగ ముచ్చట పడుతుంటే..తమ బాష ,యాసలని కించపరిచారని పత్రికలకి మీడియాకి ఎక్కిన కొందరు యువకులు సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్త పరిచిన విషయం విదితమే..ఏకంగా వారు ఓ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు..అయితే మరొక ఛానెల్ వాళ్ళు కూడా లైవ్ డిబేట్ కి రమ్మని ఆహ్వనిచాడంతో..హుటాహుటిన బయలు దేరిన ఆ యువకులకి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది..
అయితే ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవ్వగా..మరో ముగ్గురికి తీవ్రమైన గాయాలు అయినట్టుగా వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా బయటపడింది.. జలం శ్రీను, సీమ కృష్ణానాయక్, రవికుమార్..రాజశేఖర్ రెడ్డిలు అరవింద సమేత సినిమాలో తమ భాషను, జీవితాల్ని కించపరిచారనే విషయంపై జరగనున్న చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు బయలుదేరినట్టు వీరి సన్నిహితుడు ఒకరు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.
ఇంతలో తుంగభద్రానదిని దాటి కొంత దూరం వెళ్తూ ఉండగా ఒక్క సారిగా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జు నుజ్జు అయ్యింది…జలం శ్రీను అక్కడిక్కడే మరణించగా మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు…జలం శ్రీను బహుజన ఉద్యమంతోపాటు సీమ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు..ఓ పక్క సినిమా హిట్ అయింది అన్న సంతోషంలో ఉన్న ఎన్.టి.ఆర్ సీమ విద్యార్ధుల యాక్సిడెంట్ విషయం తెలుసుకుని బాధపడినట్టు తెలుస్తుంది.