గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. తల్లి తండ్రి తర్వాత గురువు దైవం అని ఎప్పటి నుండో ఉన్న మాట. మనిషి జీవితంలో గురువు స్థానం చాలా గొప్పది. గురువు లేకుండా ఎవరు ప్రతిభావంతులు కాలేదు. సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజున టీచర్స్ డే గా జరుపుకుంటారు. ఈరోజు సెలవు దినం కాదు కాని స్కూల్, కాలేజెస్ లో వేడుకలను నిర్వహిస్తారు.
భావన భారతీయ సంప్రదాయంలో ఉన్న విషయం ఏంటంటే దేవుడు, గురువు ఇద్దరు ఎదురుగా ఉంటే ముందు గురువుకి నమస్కరించిన తర్వాతే దేవుడిని ప్రార్ధించాలని అంటున్నారు. గురువు పర బ్రహ్మ స్వరూపుడని చెబుతారు. తల్లి దండ్రులు పిల్లలకు జన్మ మాత్రమే ఇస్తారు కాని వారికి జ్ఞానం ప్రసాదించి.. ఎలా బ్రతకాలో నేర్పించే వాడు గురువు.
గురు పూజోత్సవం సందర్భంగా ఈరోజు స్కూల్స్ లో విద్యార్ధులే ఉపాధ్యాయులుగా మారి క్లాసులు చెబుతారు. ఈరోజు స్టూడెంట్స్ తమ గురువులందరికి గ్రీటింగ్స్ ఇచ్చి తమ ఆనందాన్ని తెలియచేస్తారు.
నేటి బాలలే రేపటి పౌరులు.. ఆ బాలలని సమర్ధవంతమైన పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయుడికి ఉంది. ఎలాంటి బేషజాలు లేకుండా క్లాస్ లో ఉన్న పిల్లలందరు తన పిల్లలుగా భావించే వ్యక్తి ఉపాధ్యాయుడు. తమ వద్ద విద్య నేర్చుకుని అతని గొప్పవాడైనా.. లేదా అతను విజయాన్ని సాధిస్తే అది తన విజయంగా భావించే వ్యక్తి ఉపాధ్యాయుడు.
ఒకప్పుడు టీచర్ అంటే అపారమైన గౌరవం ప్రేమ ఉండేవి. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. విజ్ఞాన దారిలో నడిపించే గురువునే కించపరచేలా పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు నేటి విద్యావ్యవస్థలో కూడా ఎన్ని గంటలు చదివించాం.. ఎన్ని మార్కులు రాబట్టాం అన్న ఆలోచనే తప్ప అసలు ఎంత విజ్ఞానం ఇస్తున్నాం అన్నది మర్చిపోతున్నారు.
వ్యావ్యవస్థలో మార్పులు.. విద్య అంటే మార్కులు తెచ్చుకోవడం కాదు అన్న ఆలోచన వస్తేనే తప్ప నేటి విధ్యార్ధులు బాగుపడే అవకాశం ఉంటుంది.
టీచర్స్ డే స్పెషల్.. గురువు, దేవుడు ఎదురుగా ఉంటే.. ముందు ఎవరికి నమస్కరించాలంటే..!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి