మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం జార్జియాలో యుద్ధ సన్నివేశాలను షూట్ చేస్తున్న సైరా సినిమా క్లైమాక్స్ మార్చే ఆలోచనలో ఉన్నారట.
నరసిం హా రెడ్డి కథ అతన్ని బ్రిటీష్ వారు కోట ముందు ఉరి తీయడంతో ముగుస్తుంది. అయితే అలా అయితే మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో అని ఆయన స్పూర్తితో తర్వాత స్వాతంత్ర ఉద్యమం చేసిన వారి గురించి చెబుతూ సినిమా ముగిస్తారట. నరసింహారెడ్డి తర్వాత అల్లూరి సీతారామరాజు స్వాతంత్రం కోసం పోరాడాడు. అలా సినిమా క్లైమాక్స్ ప్లాన్ చేశారట.
అందుకే సైరా మరింత లేటు అవబోతుందని అంటున్నారు. ఈమధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా కూడా నటిస్తుందని తెలుస్తుంది.
బ్రేకింగ్ : సైరా క్లైమాక్స్ లో మార్పులు.. ఫ్యాన్స్ కి నిరాశ..!
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి