ఘట్టమనేని ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన సుధీర్ బాబు తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడంలో ఇంకా వెనుకపడి ఉన్నాడు. తన ప్రతి సినిమాకు మహేష్ చేత ప్రమోషన్ చేయిస్తున్నా అంతగా లాభం లేదు. సుధీర్ బాబు లాస్ట్ మూవీ సమ్మోహనం సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా కలక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది.
ప్రస్తుతం సుధీర్ బాబు తానే నిర్మాతగా మారి చేసిన ప్రయత్నం నన్ను దోచుకుందువటే. ఆర్.ఎస్ నాయుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ వేటిలో మహేష్ ప్రస్థావన లేకుండా చేస్తున్నాడు సుధీర్ బాబు. అంతేకాదు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మహేష్ అటెండ్ అవలేదు. మహేష్ ఫంక్షన్ ఏదైనా సుధీర్ బాబు వచ్చి ఫ్యాన్స్ ను ఉత్సాహపరచేలా మాట్లాడుతాడు.
కాని అది తనకు ఏమాత్రం లాభం చేరూచడంలేదని గుర్తించిన సుధీర్ బాబు ఈసారి మహేష్ ఇన్వాల్వ్ మెంట్ లేకుండానే నన్ను దోంచుకుందువటే సినిమా తెస్తున్నాడు. మహేష్ ప్రమేయం లేకుండా సుధీర్ బాబు ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
షాకింగ్ : మహేష్ ను పక్కనపెట్టేందుకు సుధీర్ బాబు వ్యూహం !
మరిన్ని వార్తల కోసం తెలుగు లైవ్స్ వాట్సాప్ లో ఫాలో అవ్వండి