Movies" సిల్లీ ఫెలోస్ " రివ్యూ & రేటింగ్

” సిల్లీ ఫెలోస్ ” రివ్యూ & రేటింగ్

అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్ లో భీమనేని శ్రీనివాస్ తెరకెక్కించిన కామెడీ ఎంటర్ టైనర్ సిల్లీ ఫెలోస్. నరేష్ – భీమనేని కాంబినేషన్ లో రూపొందిన సుడిగాడు సినిమా బ్లాక్ బష్టర్ అవ్వడంతో తాజా సినిమా సిల్లీ ఫెలోస్ సినిమా కూడా సక్సస్ అవుతుందనే టాక్ ఫస్ట్ నుంచి ఉంది. ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిల్లీ ఫెలోస్ సినిమా ఈరోజు (సెప్టెంబర్ 7)న రిలీజైంది. మరి..సిల్లీ ఫెలోస్ సక్సస్ అయ్యారా..? లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా కథ చెప్పాల్సిందే.

కథ – వీరబాబు (అల్లరి నరేష్) లేడీస్ టైలర్. అతని స్నేహితుడు సూరిబాబు (సునీల్) జాకెట్ జానీకీ రామ్ (జయప్రకాష్ రెడ్డి) జాకెట్లు కుట్టీ కుట్టీ ఇక లాభం లేదనుకున్నాడో ఏమో కానీ…ఎం.ఎల్.ఎ అయిపోయాడు. మినిష్టర్ గోవర్ధన్ (శంకర్ మేల్కోటే) అక్రమంగా 500 కోట్లు సంపాదించి చనిపోతాడు. వాసంతి (చిత్రశుక్లా) పోలీస్. అవ్వడం కోసం ఏం చేసింది..? వీరబాబు చేసే పనుల వలన సూరిబాబు చిక్కుల్లో పడతాడు. ఎలా ఆ చిక్కుల నుంచి బయటపడ్డాడు..? వీరి మినిష్టర్ అక్రమ సంపాదన 500 కోట్లతో లింక్ ఏంటి అనేదే మిగిలిన కథ.
34688240_1955982494433742_8224833634213822464_n
విశ్లేషణ – సిల్లీ ఫెలోస్ టీమ్…ఖచ్చితంగా అందర్నీ నవ్విస్తాం అని ప్రామీస్ చేసారు. ఆ ప్రామీస్ కి తగ్గట్టే సినిమా ఉంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆడియన్ నవ్వుతూనే ఉంటారు. వీరబాబు, సూరిబాబుల పాత్రల్లో అల్లరి నరేష్, సునీల్ తనదైన శైలిలో నటించి నవ్వించారు. సునీల్ ని చూస్తుంటే.. కమెడియన్ గా నవ్వించిన సునీల్ గుర్తుకువస్తారు. ఇక లాస్ట్ అరగంటలో వచ్చే జయప్రకాష్ రెడ్డి, పోసాని లపై చిత్రీకరించిన సీన్స్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా అయ్యేంత వరకు నవ్వుతూనే ఉన్నారంటే ఎంత హిలేరియస్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కామెడీ కింగ్ బ్రహ్మానందం కనిపించింది కొంచెం సేపే అయినా అదరగొట్టేసాడు. తనదైన శైలిలో నవ్వించాడు. శ్రీవసంత్ సంగీతం బాగుంది. అలాగే రీ రికార్డింగ్ ఇంకా బాగుంది. ఉన్నవి రెండు పాటలే అయినా చాలా బాగున్నాయి. ఈ సినిమా నిడివి 2 గంటలు. ఇది సినిమాకి ప్లస్ పాయింట్. అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా..? అనిపిస్తుంది. అలాగే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. లాజిక్ ల గురించి ఆలోచించకుండా మ్యాజిక్స్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు. సిల్లీ ఫెలోస్ చేసే సిల్లీ కామెడీకి నవ్వకుండా ఉండలేరంటే నమ్మండి. ఈ వీకెండ్ ఫ్యామిలీతో వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయచ్చు.
1
ప్లస్ పాయింట్స్ :
అల్లరి నరేష్, సునీల్ నటన
శ్రీవసంత్ సంగీతం
భీమనేని కథనం
రాజీలేని నిర్మాణం
పోసాని, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం కామెడీ

మైనస్ పాయింట్స్ :
లాజిక్స్ లేకపోవడం

రేటింగ్ 3.25/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news