టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కూడా తన ఫాంను కొనసాగిస్తుంది. నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి అమ్మడికి బాగా కలిసి వచ్చినట్టు ఉంది. ఇక ఈమధ్యనే తమిళ డబ్బింగ్ సినిమా అభిమన్యుడుతో కూడా హిట్ అందుకున్న సమంత ఆ సినిమాతో పాటుగా మహానటి, రంగస్థలం సినిమాల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన జీవితం కూడా సావిత్రి గారిలా అయ్యేదని చెప్పుకొచ్చింది. కెరియర్ మంచి స్వింగ్ లో ఉన్నప్పుడు సమంత సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. అతనికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది అయినా సరే సమంత అతనితో క్లోజ్ గా మూవ్ అయ్యింది. కొన్నాళ్లు ఈ ఇద్దరు నేడో రేపో పెళ్లిచేసుకుంటారని కూడా అన్నారు.
కాని ఫైనల్ గా సిద్ధార్థ్ నుండి దూరంగా వచ్చిన సమంత మళ్లీ కెరియర్ మీద దృష్టి పెట్టి చైతుని ప్రేమించి పెళ్లాడింది. సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకుంటే తన జీవితం కూడా మహానటి సావిత్రి గారిలా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేదని సమంత షాకింగ్ కామెంట్స్ చేయడం విశేషం.
https://youtu.be/YPQum7CGGkI