సింగం సీరీస్ లో భాగంగా సింగం, సింగం-2 వచ్చాయి. పవర్ పోలీస్ గా వచ్చిన సింగ తెలుగులో యముడు అక్కడ ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. సూర్య, అనుష్క లీడ్ రోల్ చేసిన సింగ, సింగం-2 హిట్ అయ్యాయి. హరి డైరక్షన్ లో వచ్చిన ఈ ఎస్ సీరీస్ లకు 3వ సీక్వల్ కూడా వచ్చింది అదే ఎస్-3.
అప్పటికే ఆడియెన్స్ కు బోర్ కొట్టేయడంతో ఎస్-3 ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే హరి అదే కథను కొనసాగించేలా సింగం 4 కూడా చేశాడు. అయితే ఈసారి హీరోని మార్చి ప్రయోగం చేశాడు. హరి, విక్రం కాంబినేషన్ లో సామి సినిమా వచ్చింది. ఆ సినిమాకు సీక్వల్ అన్నట్టుగా సామి స్క్వేర్ సినిమా చేశారు.
ఇది చూసిన ఆడియెన్స్ ఇది సామి స్క్వేర్ అనడం కన్నా సింగం 4 అనడం మేలని చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా విషయంలో విక్రం పప్పులో కాలేయగా సామి స్క్వేర్ ఫలితం చూసి సూర్య మాత్రం హమ్మయ్య అనుకున్నాడట. అసలైతే ఈ సినిమా ఎస్-4గా సూర్య చేయాల్సి ఉండగా చిన్నగా తప్పించుకున్నాడట. మొత్తానికి సూర్య తీసుకున్న తెలివైన నిర్ణయం వల్ల ఓ ఫ్లాప్ నుండి తప్పించుకున్నాడు.