షాకింగ్: ఆ సినిమా నుండి రష్మిక అవుట్

కన్నడ కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన రష్మిక మందన్న ఆ తర్వాత తెలుగులో ఛలో, గీతా గోవిందం సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో సూపర్ బిజీగా మారిన రష్మిక కన్నడలో వ్రిత్రా సినిమా నుండి బయటకు వచ్చేసింది. కిరాక్ పార్టీలో నటించిన రక్షిత్ అందులో హీరోగా నటిస్తున్నాడు.

ఆ సినిమా తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కాని కొన్ని కారణాల వల్ల వారిద్దరు పెళ్లి వద్దనుకున్నారు. ఇదిలాఉంటే అతనితో సినిమా కూడా చేయాలని భావించని రష్మిక వ్రిత్రా నుండి ఎక్సిట్ అయినట్టు తెలిపింది. ఈ విషయాన్నే వెళ్లడిస్తూ రష్మిక ట్విట్టర్ లో ఓ లేఖ పెట్టింది.

తెలుగులో మాత్రం రష్మిక ఫుల్ ఫాంలో ఉంది. దేవదాస్ సినిమా ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అవుతుండగా విజయ్ దేవరకొండతో మళ్లీ డియర్ కామ్రేడ్ సినిమాలో చేస్తుంది.