Gossipsషాకింగ్: బయటపడ్డ రకుల్ ప్రీత్ సీక్రెట్ ఎఫైర్.. ఆ కుర్రాడు ఎవరో...

షాకింగ్: బయటపడ్డ రకుల్ ప్రీత్ సీక్రెట్ ఎఫైర్.. ఆ కుర్రాడు ఎవరో తెలుసా?

A news going viral on Rakul Preet Singh that she is dating tollywood’s young hero who belongs to a star family.

నటీమణులు వెండితెర మీదే కాదు.. రియల్ లైఫ్‌లోనూ అప్పుడప్పుడు భలే నటిస్తుంటారు. తెరవెనుక తమకు నచ్చిన వ్యక్తులతో సీక్రెట్ ఎఫైర్లు కొనసాగిస్తుంటారు కానీ.. తెరముందు మాత్రం నిమ్మకునిరేతలా వ్యవహరిస్తుంటారు. పైగా.. తమ మీద వస్తున్న వార్తలన్నీ రూమర్లేనని కాన్ఫిడెన్స్‌గా చెబుతారు. అయినా.. ఎన్నాళ్లవరకు ఆ విషయాల్ని దాచగలరు? ఏదో ఒకరోజు బట్టబయలు కావాల్సిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ బండారం అలాగే బట్టబయలైంది.
3
ఇన్నాళ్లూ చాలా ఇన్నోసెంట్‌గా కనిపించిన ఈ భామ.. బ్యాకెండ్‌లో ఎవరికీ తెలియకుండా ఓ కుర్రాడితో ప్రేమాయణం నడిపిస్తోంది. అతను ఎవరో కాదు.. ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో ఫ్యామిలీకి చెందినవాడు. ఇప్పటికే కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆ కుర్రాడితో ఈ అమ్మడు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్‌లో విస్తృత ప్రచారం జరుగుతోంది. నిజానికి.. ఆ హీరో, రకుల్‌కి చాలాకాలం నుంచే స్నేహబంధం ఉంది. అయితే.. ఈమధ్య వీళ్ళిద్దరూ ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నారు. గతకొద్ది రోజుల నుంచి ఎక్కడచూసినా ఈ జంట తెగ సందడి చేస్తోంది. ప్రైవేట్ పార్టీలకు వెళ్ళడమే కాదు.. ఇండస్ట్రీలో జరిగే ప్రతీ ఈవెంట్‌కి ఇద్దరూ కలిసే హాజరవుతున్నారు.
2
అంతేకాదు.. ఫారిన్ ట్రిప్‌లకు కూడా వెళుతున్నారు. ఈమధ్యే ఇద్దరూ గోవా బీచ్‌కి వెళ్లి.. అక్కడ బాగా ఎంజాయ్ చేశారు. ఈ టూర్‌లో భాగంగా వీరిద్దరూ తీసుకున్న ఫోటోలు బయటకు రావడంతో.. ఆ హీరోతు రకుల్ ప్రేమాయణం కొనసాగిస్తోందన్న వార్త ఊపందుకుంది. మరి.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, రకుల్ క్లారిఫికేషన్ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
1

https://youtu.be/vPtSEN-GQLM

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news